- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం అందజేశారు.

దిశ, ఉట్నూర్ : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం అందజేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఉట్నూర్ టీచర్లకు 159, ఇంద్రవెల్లి మండల అంగన్వాడీ టీచర్లకు 102 ప్రజా ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు, బాల బాలికలకు పోష్టికాహారం అందించడంలో అంగన్ వాడీలు కృషి చేయాలని, నిత్యం బాల బాలికలకు, బాలింతలు, గర్భిణీలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందించే విషయంలో మంత్రి సీతక్క ఎంతో కృషి చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు ఆదివాసీ మంత్రి సీతక్క పై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
మహిళా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పతాకాలు ప్రవేశపెడుతున్నరన్నారు. అంగన్వాడీ టీచర్లు మరింత ఉత్సాహంతో సుపరిపాలన దిశగా డిజిటల్ సేవల ద్వారా గ్రామాల్లో సేవలందించాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మొబైల్ ఫోన్లు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఉమాదేవి, అంగన్వాడి టీచర్లు తదితరులు ఉన్నారు.






