- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఉట్నూర్ : సీఎం రేవంత్ రెడ్డిని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుదవారం హైదరాబాద్ లో కలసి వినతి పత్రం అందజేశారు. కొమురం భీమ్ వర్ధంతి ఈ నెల 7న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనీ కేరమేరి మండలం జోడేఘాట్ గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. ఆదివాసీ గిరిజన సంక్షేమం కోసం కొమరం భీమ్ చేసిన పోరాటం చరిత్రాత్మకమని.. అలాంటి మహనీయుని పోరాట పటిమ భవిష్యత్ తరాలకు ఆదర్శమని ఎమ్మెల్యే తెలిపారు. వర్ధంతి సమావేశాల కొరకు షెడ్ నిర్మాణం, జాతీయ రహదారిపై 6 కిమీ ల రోడ్ పై అనుమతుల కొరకు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 15 కోట్లు రూపాయలు, ఐటిడిఎ భవన నిర్మాణనికి 15 కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్ధంతికి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ మనువడు కుంరం సోనేరావ్, జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాధ్, భీమ్ హుస్తవ కమిటీ చైర్మన్ కుంరం లాల్షావ్, మాజీ ఎంపీపీ మిధునం పాల్గొన్నారు.






