మైసమ్మ దేవాల‌యంలో అప‌చారం..

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింత‌ల‌మానేప‌ల్లి మండ‌లం డ‌బ్బా కొత్త‌గూడ ప్రాంతంలో ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌న ఉన్న మైస‌మ్మ దేవుడి ప్రాంగ‌ణంలో బుధ‌వారం దారుణం

మైసమ్మ దేవాల‌యంలో అప‌చారం..
X

దిశ‌, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింత‌ల‌మానేప‌ల్లి మండ‌లం డ‌బ్బా కొత్త‌గూడ ప్రాంతంలో ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌న ఉన్న మైస‌మ్మ దేవుడి ప్రాంగ‌ణంలో బుధ‌వారం దారుణం చోటు చేసుకుంది. హిందువులు ఆరాద్య దైవంగా పూజించే మైస‌మ్మ దేవుని ప్రాంగ‌ణంలో కొంద‌రూ ఆవును చంపి కోసి పోగులు వేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. విష‌యం తెలుసుకున్న హిందూ సంఘాల నాయ‌కులు ఆందోళ‌న చేప‌ట్టారు. చింత‌ల మాన‌పల్లి పోలీసుల‌కు 100 స‌మాచారం అందించారు. మైస‌మ్మ దేవుడి ప్రాంగ‌ణంలో ఆవును కోసి చంపిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని హిందూ సంఘాల నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story