ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష.. రూ.60 వేలు జరిమానా....

by Bhanu |

మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెను శారీరకంగా వాడుకున్న కేసులో నిందితుడికి ఫోక్సొ కేసు కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ బుధవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చినట్లు రెబ్బెన సిఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష.. రూ.60 వేలు జరిమానా....
X

దిశ, తాండూర్ : మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెను శారీరకంగా వాడుకున్న కేసులో నిందితుడికి ఫోక్సొ కేసు కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ బుధవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చినట్లు రెబ్బెన సిఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.... రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల మైనర్ యువతిని అదే గ్రామనికి చెందిన చూనార్కర్ మహేందర్ (30) వివాహితుడు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. నీకు పెళ్లయిందని, ప్రేమ పేరుతో వేధించకని యువతి సూచించిన వినకుండ వెంట పడ్డాడు. అదే క్రమంలో యువతి ఇంటికి అతని రాకపోకలు సాగాయి.


అమ్మాయిని మహేందర్ రూ.5 వేలు, ఒక బంగారు ఉంగారం అడిగి, కొద్దీ రోజుల్లోనే ఇస్తానని చెప్పడంతో ఇవ్వగా తిరిగి ఇవ్వలేదు. మహేందర్ తనతో పలుమార్లు శారీరకంగా కలిశాడాని తన తల్లికి తెలిపింది. మైనర్ అయినా తన కూతురికి మాయమాటలు చెప్పి, శారీరకంగా వాడుకున్నందున బాధితురాలి తల్లి రెబ్బెన పోలీస్ స్టేషన్ లో 15.08.2019 న ఫిర్యాదు చేసింది. అప్పటి రెబ్బెన ఎస్.ఐ డి.రమేష్ (మొదటి ఐ.ఓ) కేసు నమోదు చేసి, (ఆసిఫాబాద్ డి.ఎస్.పి, రెండవ ఐ.ఓ ఏ.సత్యనారాయణ) దర్యాప్తు చేసి కోర్టులో నిందితుడిని హాజరు పరిచారు. పి.పీ.జగన్మోహన్ రావు, సీ.డీ.ఓ అండ్ లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్, ఏఎస్ఐ సాక్షులను హాజరు పరచగా జడ్జి సాక్షులను విచారించగా, నేరం రుజువు కావడంతో నిందితుడు చూనార్కర్ మహేందర్ కు జైలు శిక్ష జరిమాన విధిస్తూ తీర్పునిచ్చినట్లు వారు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత ఆసిఫాబాద్ ఏ ఎస్ పి చిత్తరంజన్, రెబ్బెన సిఐ బుద్దె స్వామి, రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు అభినందించారు.



Next Story