- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధుల కేటాయింపునకు మంత్రి కేటీఆర్ సుముఖం : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అహర్నిశలు పాటు పడుతున్నారు.

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అహర్నిశలు పాటు పడుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రమున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను శనివారం కలసి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫోన్ ద్వారా తెలిపారు.
తాను కోరిన పిమ్మటనే మంత్రి కేటీఆర్ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపునకు సానుకూలంగా స్పందించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి కేటీఆర్ కు బెల్లంపల్లి నియోజవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నిరంజన్ గుప్తా, బీఆర్ఎస్ ప్రతినిధి గడ్డం బీమా గౌడ్ ఉన్నారు.






