ఆదిలాబాద్ లో భారీ వర్షాలు...మంత్రి జూపల్లి ఆరా

by velandi.Saikiran |

భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు...మంత్రి జూపల్లి ఆరా
X

దిశ, ఆదిలాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆదిలాబాద్,ఆసిఫాబాద్,నిర్మల్,మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు.ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి? జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశం చేశారు.ఒకవేళ అధిక వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.మరోవైపు రైతులకు యూరియా సరఫరా ఎలా చేస్తున్నారు? కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.ప్రభుత్వ ,ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Next Story