- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నాలలో అర్ధరాత్రి భూ కబ్జా..
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కన్నాల గ్రామంలో భూమాఫియా పెట్రగిపోతుంది. భూముల ధరలకు రెక్కలు పెరగడంతో జాతీయ రహదారి అయిన కన్నాల

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కన్నాల గ్రామంలో భూ మాఫియా పెట్రగిపోతుంది. భూముల ధరలకు రెక్కలు పెరగడంతో జాతీయ రహదారి అయిన కన్నాల గ్రామంలో కొందరు బడా బాబులు, అధికార పార్టీ రాజకీయ నాయకులు అర్ధరాత్రి ట్రాక్టర్లతో ప్రభుత్వ భూములను చదును చేస్తూ కబ్జాలకు పాల్పడుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. జాతీయ రహదారి రహదారి ఏర్పడడంతో బెల్లంపెల్లి పట్టణంలోని కన్నాల గ్రామం లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అధికార పార్టీకి సంబంధించిన కొందరు బడా వ్యక్తులు కన్నాల గ్రామం శివారులోని ప్రభుత్వ భూముల్లో యదేచ్చగా కబ్జాలకు పాల్పడుతూ పెట్రేగిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కన్నాల గ్రామంలో ప్రభుత్వ భూములపై కన్నేసిన వ్యక్తులు అధికార పార్టీ పేరుతో అధికారులను మచ్చిక చేసుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నారు.
ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం..
బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాలలో సర్వేనెంబర్ 170 ప్రభుత్వ భూమి వేల ఎకరాల్లో ఉంది. అధికారులు ప్రభుత్వ భూములను పర్యవేక్షించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం తో ప్రభుత్వ భూముల్లో భూమాఫియా పెట్రేగిపోతుంది. దీనికి కారణం అధికారులు రాజకీయ నాయకుల కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు కబ్జా చేసిన భూములకు నామమాత్రపు నోటీసులు ఇస్తూ జిల్లా ఉన్నత స్థాయి అధికారులను సైతం తప్పుడు నివేదికలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని సమాచారం. కన్నాల గ్రామంలో ట్రాక్టర్ల తో ప్రభుత్వ భూమిని చదును చేస్తూ కొందరు బడ రాజకీయ వ్యక్తులు రాత్రి సమయంలో కబ్జా చేయడం కన్నాల గ్రామంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.






