- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో వైద్యాధికారి లీలలు

నీకింత.. నాకింత..
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో వైద్యాధికారి లీలలు
సెలవులో ఉన్న ఉద్యోగులకు జీతాలు
ఏకంగా నెలల తరబడి వేతనాలు చెల్లింపు
కమీషన్ కోసం కక్కుర్తితో విషయం వెలుగులోకి..
వైద్య ఆరోగ్య శాఖలో అధికారుల వక్రబుద్ది
జిల్లాలో చర్చానీయాంశం
దిశ బ్యూరో కరీంనగర్ : వైద్య ఆరోగ్యశాఖ లో అక్రమార్కులు రాజ్యం ఏలుతున్నారు. పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. విధులకు హజరు కాకపోయినా సెలవులో ఉన్నా జీతాలు చెల్లిస్తూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఒక్క నెల రెండు నెలలు కాదు ఏకంగా నెలల తరబడి జీతాలు చెల్లిస్తూ ప్రభుత్వ సొమ్మును ఫలహారం లా పంచేస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఓ మండల వైద్య అదికారి సెలవులో ఉన్న ఉద్యోగికి జీతం చెల్లించి కమీషన్ కోసం కక్కుర్తి పడటంతో డామీట్ కథ అడ్డం తిరిగింది. జీతం ఎవరు ఇవ్వమన్నారు అంటు సదరు ఉద్యోగి బంధువులు ఎదురుతిరగబడటంతో అవినీతి అధికారి బాగోతం బట్టబయలు అయ్యి ఇప్పుడు జిల్లాలో చర్చానీయంశంగా మారింది.
సెలవులో ఉన్న ఉద్యోగికి జీతం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం హెల్త్ సెంటర్ వైద్య అధికారి అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించడంలో ఆయనకు సాటి మరొకరు లేరంటే వైద్య శాఖలో అతిశయోక్తి లేదు. అందినకాడికి దండుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా తాజాగా నందిమేడారం పీహెచ్ సి పరిధిలోని ధర్మారం హెల్త్ సెంటర్ లో నేషనల్ హెల్త్ మిషన్ క్రింద అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న ఓ సెకండ్ ఏఎన్ ఎం ఆరోగ్య పరిస్థితుల రిత్య గత నాలుగు నెలలుగా సెలవు పెట్టి ఉద్యోగానికి రావడం లేదు. ఈ అవకాశాన్ని వాడుకునేందుకు చూసిన వైద్యాధికారి సదరు ఏఎన్ ఎం కు హాజరు పట్టికలో సెలవులో ఉంది. అని పంపిచాల్సి ఉండగా విధులకు హాజరైనట్లు పంపించాడు. దీంతో సదరు ఉద్యోగికి యథావిధిగా జీతం అకౌంట్ లో జమయ్యింది. దీంతో సదరు అధికారి నాలుగు నెలలు పనిచేయకపోయినా జీతం చెల్లించాను నా కమీషన్ నాకు పంపించండి అంటూ కబరుపంపినట్టు సమాచారం. దీంతో సదరు ఉద్యోగి బంధువులు అలా ఎలా ఇస్తాం.. అంటూ ఎదురుతిరిగారు. దీంతో విషయం ఆ నోట ఈనోట మండలం మొత్తం ప్రచారం జరిగి చర్చానీయంశంగా మారింది.
కమీషన్ కోసం కక్కుర్తితో వెలుగులోకి ..
పారదర్శకంగా వ్యహరించాల్సిన ఓ మండల వైద్యాధికారి కమీషన్ల కోసం కక్కుర్తి పడటంతో అక్కడి అవినీతి భాగోతం బట్టబయలు అయింది. సెలవు పెట్టి విధులకు హజరు కాకపోయినా జీతం యధావిధిగా చెల్లించడం వివాదస్పదంగా మారింది .ఒక్క నెల రెండు నెలలు కాదు నెలల తరబడి జీతాలు చెల్లించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే అడిగేవారు లేకపోవడంకో సదరు అధికారి ప్రతి పనిలో తన వాట తనకు కావాలంటూ ఉద్యోగుల నుంచి బలవంతంగా వసూల్ చేస్తున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన పరిధిలో పనిచేసే ఓప్పంద ఉద్యోగివద్దనే ఈ రకంగా వ్యవహరిస్తే ఇక రెగ్యులర్ ఉద్యోగుల పట్ల తను వ్యవహరించే తీరు మరింత దారుణంగా ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరివాట వారిదే
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపు నియంత్రణ తప్పుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విధులకు హాజరుకాకపోయినా అడిగే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా జీతాలు చెల్లించడంలో పైనుండి క్రింది వరకు ఎవరివాట వారికి ముడుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వైద్యశాఖలో అక్రమాలు ఎన్ని జరిగిన బయటకు రావడం లేదు. అనేది సర్వత్రా వ్యక్తం అవుతున్నా అభిప్రాయం.
అందుబాటులో లేని వైద్యాధికారి
నేషనల్ హెల్త్ మిషన్ లో కాంటాక్ట్ ఉద్యోగి సెలవులో ఉన్న జీతం చెల్లింపులు జరిగిన విషయం వివరణ అడిగేందుకు మండల వైద్య అధికారి డాక్టర్ అనుదీప్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులో లేరు. చరవాణి ద్వారా ప్రయత్నం చేయగా నెట్ వర్క్ ఏరియాలో లేదు అని సమాధానం వచ్చింది. పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికి సదరు అధికారి ఫోన్ అందుబాటులో లేదు అనే సమాధానమే వచ్చింది.






