గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి..

by Bhanu |

ఖీర్డి గ్రామానికి చెందిన నానివేణి గణేష్ (30) గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి..
X

దిశ, వాంకిడి : ఖీర్డి గ్రామానికి చెందిన నానివేణి గణేష్ (30) గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ వాంకిడిలో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో టోల్‌ప్లాజా సమీపంలో అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో గణేష్ రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు.

స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించినా, ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. గణేష్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story