- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోటీసులు పట్టించుకోని దుకాణదారులకు భారీ షాక్
ఉట్నూర్ పట్టణంలో దుకాణాల ముందు డ్రైనేజీల పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్, ఈఓ శంకర్ ఆధ్వర్యంలో తొలగించారు.

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ పట్టణంలో దుకాణాల ముందు డ్రైనేజీల పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను పంచాయతీ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్, ఈఓ శంకర్ ఆధ్వర్యంలో తొలగించారు. పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల పై ఏర్పాటు చేసిన అక్రమ షెడ్డులు, బోర్డులను పంచాయతీ సిబ్బంది జేసీబీలతో తొలగించారు. గత కొన్ని రోజులుగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు డ్రైనేజీల పై ఉన్న అక్రమ షెడ్డులు, బోర్డులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని దుకాణదారులకు నోటీసులు జారీ చేసి ప్రచారం నిర్వహించినట్లు సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ తెలిపారు. అయితే కొందరు నోటీసులను పట్టించుకోకపోవడంతో పంచాయతీ సిబ్బంది జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు, దుకాణాల బోర్డులు, వస్తువులు ఉంచడం వల్ల వాహనదారులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆమె కోరారు.






