ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by Bhanu |

ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి దాడి ఆకాశ్(21), అల్లకొండ కళ్యాణ్(22) ద్విచక్ర వాహనంపై అదిలాబాద్ వైపు వెళ్తుండగా మావల సమీపంలో మూలమలుపు ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందగా కళ్యాణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని రిమ్స్ కు తరలించగా చికిత్స పొందతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు మావల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Next Story