- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాక్ మార్కెట్ పేరుతో భారీ మోసం
ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ అమాయకులను మోసం చేసి దాదాపు ఒక కోటి 19 లక్షల వరకు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

దిశ, ఉట్నూర్ : ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ అమాయకులను మోసం చేసి దాదాపు ఒక కోటి 19 లక్షల వరకు వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఉట్నూర్ ప్రాంతానికి చెందిన షేక్ జావీద్, కొత్తపెల్లి గంగాధర్ అనే ఇద్దరు నిందితులు ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ఉట్నూర్, పరిసర గ్రామాల 25 మంది అమాయక ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టి, మొత్తం రూ.1,19,04,000 వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అధిక లాభాలు వస్తాయంటూ అప్లికేషన్ ద్వారా లాభాలను చూపిస్తూ వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులను వసూలు చేసి మోసం చేశారని తెలిపారు.
మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతూ, ఇల్లు, ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఇటీవల ఆదివారం ఫిర్యాదు దారుడు ఆనంద్వార్ మనోజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల వద్ద నుంచి ఐఫోన్ 16 ప్రో, వివో V29E, Vivo Y2 మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఓపెన్ ప్లాట్ పత్రాలు, ఇళ్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని నిందితుల పై పలు సెక్షన్ల కింద కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందనీ, అధిక లాభాల పేరుతో మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎస్సై గుంపుల విజయ్, సిబ్బంది నరేష్, తానాజీ, బాబ్జి, ఉష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






