ఎస్‌బిఐ బ్యాంకులో నగదు, బంగారం డిపాజిట్లలలో భారీ మోసం

by velandi.Saikiran |

చెన్నూరు పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఎస్బిఐ బ్రాంచ్ లో వినియోగదారులకు సంబంధించిన బంగారం, నగదులో భారీగా మోసం జరిగినట్లు

ఎస్‌బిఐ బ్యాంకులో నగదు, బంగారం డిపాజిట్లలలో భారీ మోసం
X

దిశ, చెన్నూర్: చెన్నూరు పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఎస్బిఐ బ్రాంచ్ లో వినియోగదారులకు సంబంధించిన బంగారం, నగదులో భారీగా మోసం జరిగినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం సిపి అంబర్ కిషోర్ బ్యాంకును సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. .

ఎస్బిఐ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్లు బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాలలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులు ఎవరన్నది నిర్ధారణ కాలేదన్నారు. ఎంత మేరకు లావాదేవీలలో మోసం జరిగిందనే విషయాన్ని బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆడిట్ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని ఆయన అన్నారు. బ్యాంకులో పని చేస్తున్న సిబ్బందిపై అనుమానాలు ఉన్నాయని త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

Next Story