- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసం బట్టబయలు
ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0లో భారీ సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0లో భారీ సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 74 అనుమానాస్పద మ్యూల్ అకౌంట్లను గుర్తించి,12 ప్రధాన కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మోసాల ద్వారా మొత్తం రూ.7,01,83,214 అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. గేమింగ్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్, టాస్క్/రివ్యూ మోసాల ద్వారా డబ్బు మార్పిడి జరిగినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసుల్లో షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్‌లను రిమాండ్‌కు పంపగా, మరికొంత మందిని నిందితులుగా గుర్తించారు.
దేశవ్యాప్తంగా నమోదైన NCRP ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రజలు తమ బ్యాంకు ఖాతాలు, ATM కార్డులు, OTP, PIN వివరాలు ఇతరులకు ఇవ్వవద్దని హెచ్చరించారు. బ్యాంక్ ఖాతాలను స్నేహితులు,బంధువులకు ఇచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది రియాజ్, మజీద్, త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.






