గంజాయి పట్టివేత... ఇద్దరి రిమాండ్

by Taduka Kalyani |

ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కౌటాల సీఐ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు.

గంజాయి పట్టివేత... ఇద్దరి రిమాండ్
X

దిశ, బెజ్జూర్ : ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కౌటాల సీఐ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూరు మండలంలోని సలుగు పల్లి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని విచారించి తనిఖీలు చేపట్టగా, వారి వద్ద 3.60 కిలోల గంజాయి లభ్యం కావడంతో అదుపులో తీసుకున్నామని వివరించారు. మంచిర్యాల జిల్లా గద్దె రాగడికి చెందిన తోకల తిరుపతి, చెన్నూరు కు చెందిన పైడిపల్లి రాజ్ కుమార్ అనే వ్యక్తులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి మంచిర్యాలలో ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో తగరపు రాజు అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పట్టుపడ్డ గంజాయి విలువ 90000 ఉంటుందని, వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం పరుచుకుని సీజ్ చేసి రిమాండ్ పంపించామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని గంజాయి సరఫరా వెనుక ఎవరు ఉన్నారనేది పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జూర్ ఎస్ఐ సర్తాజ్ పాష ఉన్నారు.

Next Story