- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి కి ఆమడదూరం లో మందమర్రి పట్టణం : బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్
అభివృద్ధి కి ఆమడదూరం లో మందమర్రి పట్టణం ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్ పేర్కొన్నారు.

దిశ, మందమర్రి: అభివృద్ధి కి ఆమడదూరం లో మందమర్రి పట్టణం ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్ పేర్కొన్నారు. మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జె.రవీందర్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్మిక శాఖమంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ఎన్నికలలో సమయంలో ఇచ్చిన హామీ ముఖ్యంగా మందమర్రి ఏజెన్సీ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మారుస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించకపోవడం సిగ్గుచేటు అన్నారు. పట్టణాభివృద్ధి పనులు విఫలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గెలిచిన వెంటనే మందమర్రి పట్టణంలోని మార్కెట్, బస్టాండ్ లో శంకుస్థాపన చేసిన సులబ్ కాంప్లెక్స్ ఇప్పటివరకు కూడా పూర్తి చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. బీఆర్ఎస్ హయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మందమర్రి మున్సిపాలిటి అభివృద్ధికి 25.66 కోట్ల రూపాయలు నిధులు తీసుకొనివచ్చి అభివృద్ధి పనులు ప్రారంభించారన్నారు. పాత బస్ స్టాండ్ ఏరియా ప్రజల కోసం కూరగాయల మార్కెట్ కోసం 9.50 కోట్లు, పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం కేసీఆర్ పార్కు 3.50 కోట్లు, రెండు చోట్ల హిందూ శ్మశాన వాటిక కోసం 3.60 కోట్లు, క్రిస్టియన్, ముస్లిం వారి కోసం 60 లక్షలు, పట్టణం లోని పోస్ట్ ఆఫీస్ నుండి పాలచెట్టు వరకు రహదారి వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కొరకు 2 కోట్లు, అంబేద్కర్ స్కిల్ సెంటర్ కోసం 5కోట్లు, పాత బస్ స్టాండ్ ఏరియా లో దోభి ఘాట్ వరకు 2 కోట్లు ఈ పనులను పూర్తి చేయక ఈ అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను వాడుకుంటూ రోడ్లు డ్రైనేజీలు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా మంత్రి వివేక్ అని పట్టణ బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా మందమర్రిలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగేలా ఉత్తర్వులు తీసుకొని రావాలి. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ మంత్రి వచ్చినపుడు చేసే హైరానా మున్సిపాలిటీ ఎన్నికల కోసం , పట్టణ అభివృద్ధి కోసం మంత్రి వద్ద మోకరిల్లకుండా పట్టణ అభివృధి కోసం పాటు పడాలని పట్టణ బిఆర్ఎస్ నాయకులు కోరారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు జె.రవీందర్ , సెక్రెటరీ జనరల్ బండారు సూరిబాబు,టీబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, పార్టీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు మద్ది శంకర్, కొంగల తిరుపతిరెడ్డి, బోరిగం వెంకటేష్, మేడిపల్లి మల్లేష్, భూపెల్లి కనకయ్య,పల్లె నర్సింగ్, వీరరెడ్డీ, నలువాల సమ్మయ్య, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్,ఎం.డి ముస్తఫా, బెల్లం అశోక్, దాసరి నవీన్, ముల్కల రమేష్,రవి నాయక్, మొగురం శ్రీను, మటన్ రాకేష్, పోషం, రవి వర్మ, పవయ్య ,శేఖర్ యాదవ్, వేణుగోపాల్, సంగర్తి సంతోష్ , కొండం శ్రీను, మోహన్ ,బెల్లం అరుణ్, మొగిలి అజయ్, సీపెల్లి సాగర్ పాల్గొన్నారు.






