- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం : బాల్క సుమన్
మందమర్రి జాతీయ రహదారి వద్ద పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది.

దిశ, మందమర్రి: మందమర్రి జాతీయ రహదారి వద్ద పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ భారీ బైక్ ర్యాలీలో చెన్నూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి నడిపెల్లి సుజిత్ రావు పాల్గొనడం జరిగింది. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి బాల్క సుమన్ పూలమాల వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. సుమారు పది కిలోమీటర్ల మేరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీ పాత బస్ స్టాండ్ నుండి మార్కెట్ లోని పుర వీధులలో తిరుగుతూ కార్యకర్తలను ప్రజలను ఉద్దేశిస్తూ సుమన్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అన్నారు. ఈ అప్రజాస్వామిక విధానాలతో చెన్నూరు నియోజక వర్గంలో కూడా అభివృధి పడకేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చారు ఇండస్ట్రీలు తీసుకొని వస్తాం అన్నారు.. నలభై ఐదు వెయ్యిల ఉద్యోగాలు , అగ్రికల్చర్ యూనివర్సిటీ, మైనింగ్ కళాశాల, సింగరేణి కార్మికుల కు పదిహేను లక్షల రూపాయలతో గృహ నిర్మాణానికి ఋణాలు అన్నారు ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు.
అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలే చెప్పుకుంటూ పోతే కేసీఆర్ డబుల్ బెడ్ రూంలు నిర్మాణ పనులు పూర్తి ఐన ఇంతవరకు లబ్ది దారులకు చేకూర్చలే. మా హయాంలో ఇసుక దందా చేశామని అన్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఈ పద్దెనిమిది నెలల వ్యవధిలో భీమారం మండలం ఒక జర్నలిస్ట్ సోదరుడు ఇసుక లారీ గుద్దుకుని చనిపోయాడు. నియోజక అభివృధి గాలికి వదిలేశారు. పెళ్ళికి గాను ఆడ బిడ్డకు తులం బంగారం, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడ బిడ్డలకి స్కూటీ అంటే నమ్మినారు. ప్రతి మహిళలకి అకౌంట్ లో రెండువేల ఐదు వందల రూపాయలు అంటే నమ్మిండ్రు. నిన్ను నీ కొడుకు ని గెలిపించారు. మినిస్టర్ పదవి కోసం ఉన్న ఆత్రుత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు మాత్రం నెరవేర్చలేదు. వీటి అన్నింటికి ప్రక్షాళన చేయాలంటే మళ్ళీ కేసీఆర్ అధికారం లోకి వస్తే తప్ప మన హక్కులను మనం సాధించలేము. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం లోకి రావాలంటే ఇంకా రెండు దశాబ్దాలు పడుతుంది అని రేపు జరగబోయే బిఆర్ఎస్ రజతోత్సవ సభకి పట్టణ ప్రజలు , మేధావులు, కార్మికులు, రావాలని కార్యకర్తలు ముందుండి సభను విజయవంత చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజక వర్గం ఇంచార్జీ డాక్టర్ రాజరమేష్, టిబిజికెఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, మద్ది శంకర్, వెంకటేష్, మల్లేష్, తిరుపతి రెడ్డి, ముస్తఫా, యువ నాయకులు పాల్గొన్నారు.






