మండ‌ల స‌ర్పంచ్ ల సంఘం కార్య‌వ‌ర్గం ఎన్నిక

by Ratna Kumari |

దిశ‌, ముధోల్ : మండ‌ల కేంద్రం ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మండ‌ల స‌ర్పంచ్ ల సంఘం కార్య‌వ‌ర్గాన్ని

మండ‌ల స‌ర్పంచ్ ల సంఘం కార్య‌వ‌ర్గం ఎన్నిక
X

దిశ‌, ముధోల్ : మండ‌ల కేంద్రం ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మండ‌ల స‌ర్పంచ్ ల సంఘం కార్య‌వ‌ర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. మండల సర్పంచ్ ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆత్మస్వరుప్(మచ్కల్), అధ్యక్షుడుగా కల్లేడ కిష్టయ్య( బోరిగాం), ఉపాధ్యక్షుడు దుమానాయక్ (ఎడ్బిడ్ తాండ ), ప్రధాన కార్యదర్శి బోమ్మెల గంగాధర్ (రాంటేక్ ), కోశాధికారి అప్పల రాజు (గన్నోర), మౌనిక మహేందర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. సర్పంచ్ ల కార్యవర్గాన్ని మండల బీజేపీ సర్పంచ్ ల ఎన్నికల ఇన్ చార్జి పట్టేపూరం మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సంఘం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీలకతీతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు రాంచందర్ రెడ్డి, నక్క మల్లేష్, గణేష్ యాదవ్, కరిపే రమేష్ , మలింగి లక్ష్మిగంగాధర్, మెత్రి నారాయణ, బీజేపీ నాయకులు లక్ష్మినారాయణ, విఠల్ రావు, ధర్మపురి శ్రీనివాస్, లడ్డు పోతన్న, బోరిగాం సాయి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story