మద్యం తాగొద్దన్నందుకు సుద్దవాగులో దూకిన వ్యక్తి

by Jakkula.Mamatha |

మద్యం తాగొద్దు అన్నందుకే సుద్ద వాగు బ్యాక్ వాటర్‌లో దూకి టేకేవార్ పిరాజీ(56) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

మద్యం తాగొద్దన్నందుకు సుద్దవాగులో దూకిన వ్యక్తి
X

దిశ, కుబీర్: మద్యం తాగొద్దు అన్నందుకే సుద్ద వాగు బ్యాక్ వాటర్‌లో దూకి టేకేవార్ పిరాజీ(56) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సాంవ్లీ గ్రామానికి చెందిన పిరాజీ కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. భార్య కుమారుడు తాము చేను పనులకు వెళ్తున్నాము.. పొలానికి రమ్మని చెప్పి వెళ్లారు. పొలానికి వెళ్లకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సుద్దబాగు బ్రిడ్జి వద్ద చెప్పులు, బట్టలు కనబడినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం చేరింది. ప్రదేశంలో గజ ఈత గాళ్ళతో వెతకగా మృతదేహం బయటకు తీశారు. మద్యం తాగొద్దనందుకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు.

Next Story