- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
మండలానికి చెందిన గేడం సోమేశ్వర్ (౩౦) శుక్రవారం బైక్ ఢీకొని మృతి చెందగా కొమురం మాల్కు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

X
దిశ, వాంకిడి : మండలానికి చెందిన గేడం సోమేశ్వర్ (౩౦) శుక్రవారం బైక్ ఢీకొని మృతి చెందగా కొమురం మాల్కు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన సోమేశ్వర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న టీఎస్ 20 సీ 0104 నెంబర్ గల బైక్ వచ్చి ఢీకొట్టింది. దీంతో సోమేశ్వర్, మాల్కుల తలకు గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు గమనించి అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమేశ్వర్ మృతి చెందాడు. మాల్కు పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






