- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. కారణం ఇదే!
స్వయం ఉపాధితో తన జీవిత లక్ష్యం సాధించడానికి ప్రయత్నించాడు. అది సహకరించకపోవడంతో కలత చెందాడు.

దిశ, కుబీర్: స్వయం ఉపాధితో తన జీవిత లక్ష్యం సాధించడానికి ప్రయత్నించాడు. అది సహకరించకపోవడంతో కలత చెందాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. బయటపడే మార్గం కనిపించక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన దార్ కుబీర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధార్ కుబీర్ గ్రామానికి చెందిన జరుగు లక్ష్మణ్(46) వ్యవసాయ పనుల కోసం గత సంవత్సరం హార్వెస్టర్ కొనుగోలు చేశాడు. నెల నుండి వాహనం రిపేరుకు గురైంది. దీంతో హార్వెస్టర్ వాహనం సరిగ్గా పని చేయలేదు. కట్టవలసిన రెండు లక్షల రూపాయలు ఎలా కట్టాలో కలత చెందాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి.
గురువారం తన పంట చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. ఇంటికి వచ్చి విషయం భార్యతో చెప్పడంతో చుట్టుపక్కల వారి సహకారంతో బైంసాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య కమలాబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మృతుడు వార్డు సభ్యునిగా గెలుపొందాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయమని కుటుంబ సభ్యుల ఆర్తనాథాలతో మిన్నంటాయి.






