- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి : మాల మహానాడు
దిశ, లక్షెటిపేట : పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 24 శాతం రిజర్వేషన్లు పెంచాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దమ్మ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం

దిశ, లక్షెటిపేట : పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 24 శాతం రిజర్వేషన్లు పెంచాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దమ్మ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో 'మాలల రణభేరి సభ' వాల్ పోస్టర్లను మాల మహానాడు సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దమ్మ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 23న జరిగే మాలల రణభేరి సభను విజయవంతం చేయాలనీ, మాలల హక్కుల సాధనకై జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నమ్మన్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్ మెంట్ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాలల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలనీ, గతం సంవత్సరం లో కేటాయించి విడుదల చేయకుండా ఆపేసిన నిధుల విడుదల చేయాలనీ అయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాలెం చిన్నన్న, భూపెల్లి మల్లేష్, దొంత నర్సయ్య, భైరం లింగన్న, తొగరు రాజు, మినుముల శాంతి కుమార్, దొండ ప్రభాకర్, గరిసే రవీందర్, కోడి మల్లేష్, బొల్లెడ్ల విజయ్, మినుముల జనార్దన్, పెండెం సత్తయ్య, వేముల ప్రేమ్ సాగర్, మగ్గిడి సాయి పాల్గొన్నారు.






