- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం
by Batti.Sumithra |
మండలంలోని వడూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట దగ్ధమైంది.

X
దిశ, నేరడిగొండ : మండలంలోని వడూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట దగ్ధమైంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వడూర్ గ్రామానికి చెందిన రైతు కడారి రాములు తనకు చెందిన ఎకరన్నర భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. తన చేనులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి, మొక్కజొన్న పంటలోకి వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు 15 క్వింటాళ్ల మొక్కజొన్న కాలిపోయింది. దీనివల్ల సుమారు రూ.40 వేల నష్టం వాటిల్లిందని, కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కాలిపోవడం ఎంతో బాధాకరమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.
Next Story






