- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశువులకు వ్యాపిస్తున్న లంపిస్కిన్ వ్యాది..!
దిశ, కుబీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో పశువులకు లంపిస్కిన్ వ్యాధి సోకుతున్నాదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా చిన్న వయసున్న పశువుల్లో మాత్రం త్వరగా సోకుతున్నదని

X
దిశ, కుబీర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో పశువులకు లంపిస్కిన్ వ్యాధి సోకుతున్నాదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా చిన్న వయసున్న పశువుల్లో మాత్రం త్వరగా సోకుతున్నదని రైతులు అంటున్నారు. వైద్యం కోసం వెళ్తే ప్రైవేట్ మందులు రాసిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మేత తినక పోవడం, నీరసంగా ఉండడంవంటి లక్షణాలు ఉండడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సెలైన్లకు యాంటీ బయోటిక్ మందులకు ఖర్చులు తడిసి మొపెడు అవుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం వ్యాధికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పశువుల వైద్యాధికారి ప్రకాష్ వివరణ కోరగా వ్యాధికి సంబంధించిన కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మిగతా పశువులకు సోకదు. పశువుల కొట్టాలను శుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు.
Next Story






