ప్రేమ వివాహం.. దేవుడికి కోపమొచ్చిందేమో.. ఇలా జరిగింది!

by Naveena |

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

ప్రేమ వివాహం.. దేవుడికి కోపమొచ్చిందేమో.. ఇలా జరిగింది!
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. గాదే సృజన లక్షెట్టిపేటలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. డిగ్రీ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో అదే కళాశాలలో చదువుతున్న విశ్వవర్ధనతో ప్రేమలో పడింది. అయితే వీరి కులాలు వేరు కావడంతో.. పెద్దలు వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో సృజన, విశ్వవర్ధన్ స్నేహితుల సహాయంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం వేరు కాపురం పెట్టి గత ఆరు నెలలు గా అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

అయితే వీరి జీవితం లో ఏం జరిగిందో ఏమో కానీ.. గత నెల 24తేదీన విశ్వవర్ధన్ రాయపట్నం గోదావరి బ్రిడ్జి నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణ వార్త విని సృజన జీర్ణించుకోలేకపోయింది. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి..శనివారం రోజు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త మరణించిన 15రోజులకే భార్య ఉరివేసుకోవడంతో.. అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story