పశు సంపాదను కాపాడుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Ratna Kumari |   (  Updated:2025-10-15 14:11:27  IST  )

దిశ, మంచిర్యాల : పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ లో జిల్లా పశుసంవర్ధక

పశు సంపాదను కాపాడుకోవాలి :  కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల : పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ తో కలిసి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం లో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల సంబంధిత గోడ ప్రతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అందించడం జరుగుతుందన్నారు. 4 నెలలు దాటిన ప్రతి పశువుకు ఈ టీకాలు అందించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.2 లక్షల 42 వేల పశువులకు టీకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 35 బృందాల ద్వారా 94 మంది పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు టీకాలను అందిస్తారని తెలిపారు. వ్యాధి కారణంగా పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని, పునరుత్పత్తి, పని సామర్థ్యం తగ్గడంతో పాడి రైతులకు నష్టం జరుగుతుందన్నారు. దీనిని నివారించేందుకు ప్రతి పశువుకు టీకాలు అందించాలని తెలిపారు. టీకాలు వేసిన ప్రతి పశువుకు గుర్తింపు కొరకు ట్యాగ్ వేసి వివరాలను భారత్ పశుధాన్ యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామ పెద్దలు, రైతులు తమ పశువులకు టీకాలు వేయించి వాటి సంరక్షణకు కృషి చేయాలని తెలిపారు.పశుసంపాదను కాపాడుకోవాలని కోరారు.

Next Story