- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాగజ్‌నగర్‌లో లిక్కర్ మాఫియా అరాచకం
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మద్యం వ్యాపారులు బరితెగించారు. చట్టం తమ జేబులో ఉందన్నట్లుగా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు.

దిశ, కాగజ్‌నగర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మద్యం వ్యాపారులు బరితెగించారు. చట్టం తమ జేబులో ఉందన్నట్లుగా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పట్టణంలోని మీనాక్షి వైన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. సాధారణంగా మద్యం దుకాణం నుంచి ఇతర ప్రాంతాలకు మద్యం తరలించడం నిషేధం కానీ మీనాక్షి వైన్స్ యాజమాన్యం మాత్రం ఇవేమీ పట్టించు కోకుండా మంగళవారం మధ్యాహ్నం వేళ అందరూ చూస్తుండగానే ఆటోలో మద్యం బాక్సులను లోడ్ చేసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు.
ప్రధాన రహదారుల గుండా ఈ అక్రమ రవాణా సాగుతున్నా అడ్డుకోవాల్సిన రక్షకులు కళ్లు మూసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైన్స్ షాపు వద్దకు సంబంధించిన ఖాళీ డబ్బాలు చెత్త డ్రమ్ములను నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రహదారిపైనే ఉంచుతున్నారు. వైన్స్ షాపు మలుపు వద్ద డ్రమ్ములను ఉండటం భారీ వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ కి ఇబ్బంది జరుగుతుంది. పట్టణంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరించడం వెనుక భారీ లోగుట్టు ఉందనీ మద్యం మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో మునిగిపోయారు. ఈ అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు అని స్థానిక ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చిన్నపాటి నిబంధన అతిక్రమిస్తేనే సామాన్యులపై విరుచుకుపడే అధికారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమ మద్యం రవాణా జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మీనాక్షి వైన్స్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.






