- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుష్టు రహిత సమాజమే ధ్యేయం : డిప్యూటీ పారా మెడికల్ అధికారి వామన్ రావ్
దిశ, బోథ్: కుష్టు రహిత సమాజమే ధ్యేయమని డిప్యూటీ పారా మెడికల్ అధికారి వామన్ రావ్ తెలిపారు. బుధవారం మండలంలోని బోథ్,

దిశ, బోథ్: కుష్టు రహిత సమాజమే ధ్యేయమని డిప్యూటీ పారా మెడికల్ అధికారి వామన్ రావ్ తెలిపారు. బుధవారం మండలంలోని బోథ్, పొచ్చెర గ్రామాలతో పాటు సోనాల మండల కేంద్రంలో ఆశాకార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ అధికారి వామన్ రావు మాట్లాడుతూ కుష్టు వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంతో ఆశా కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ పారా మెడికల్ అధికారి వామన్ రావు అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈ నెల 31 వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. శరీరం పై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దు బారిన మచ్చలు, కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు ఎవరికైనా ఉన్నట్లయితే తమ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి చూపించుకోవాలని కోరారు. ఎండీటీతో కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి అంగవైకల్యం కలగదని పేర్కొన్నారు. 2027 సంవత్సరం వరకు భారతదేశాన్ని కుష్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఆశా కార్యకర్తలు సైతం సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఆయా గ్రామాలలో కుష్టు వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ రమేష్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.






