సీఎంఆర్ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలి

by Disha Web Desk 20 |
సీఎంఆర్ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలి
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలోగల సీఎంఆర్ షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన ఓపెన్ టీవీలను, ఎల్ ఈడీ లైట్ లను వెంటనే తొలగించాలని పీడీఎస్ యూ, ఐఎస్టీయూ, నాయకులు కోరారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేసారు.

ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్ మిదుగా వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే ఓపెన్ టీవీలు, హై లైటింగ్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ, ఐఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed