- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఇందుకోసం ప్రతి పోలీస్ అధికారికి చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ సూచించారు.

చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఇందుకోసం అవగాహన పెంచుకోవాలి
అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్
దిశ, ఆసిఫాబాద్ : చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఇందుకోసం ప్రతి పోలీస్ అధికారికి చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నేరాల నిరోధకంలో చట్టపరమైన పరిజ్ఞానం అత్యంత కీలకమని. ప్రతి పోలీస్ అధికారి చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటేనే బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. సాక్ష్యాధారాల సేకరణలో జాగ్రత్తలు. దర్యాప్తు పద్ధతులు. ఎఫ్ఐఆర్ నమోదు విధానం. మైనర్ కేసులలో చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాలు. మహిళలపై జరిగే నేరాల పరిధిలో అమలు చేయాల్సిన ప్రత్యేక నిబంధనలపై క్షుణ్ణంగా వివరిస్తూ పోక్సో చట్టం 2012 జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015.మోటార్ వెహికల్ యాక్ట్ 1988. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018.ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ 1985. సైబర్ నేరాలపై అమలు చేయాల్సిన చట్టాలపొ పలు సూచనలు చేస్తూ పక్కాగా అమలు చేయాలని పోలిస్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రత్యేక సమావేశంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్. సీనియర్ సివిల్ జడ్జ్ యువరాజు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనంతలక్ష్మి. ఆదిలాబాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ రమణారెడ్డి.ఏఎస్పీ చిత్తరంజన్. డిఎస్పి వాహీదుద్దీన్ తదితరులు ఉన్నారు.






