కలెక్టర్ చొరవతో భూ సమస్యకు చెక్..

by Batti.Sumithra |

ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మరోసారి తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించారు.

కలెక్టర్ చొరవతో భూ సమస్యకు చెక్..
X

దిశ, ఆదిలాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం చూపుతున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మరోసారి తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గిరిజన రైతుల భూ సమస్యను వేగంగా పరిష్కరించి వారికి న్యాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్సిబి తండాకు చెందిన గిరిజన రైతుల 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కలెక్టర్ చొరవతో ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, సర్వే సమస్యలు పరిష్కరించబడ్డాయి. దశాబ్దకాలంగా పట్టాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 9 మంది ఎస్టీ రైతులకు మొత్తం 30 ఎకరాల భూమిని కేటాయించి, 2 నుంచి 3 ఎకరాల వరకు పట్టాలు స్వయంగా అందజేశారు.దీంతో వారు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం లభించింది. పట్టాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంఆర్ఓ రాజ్‌మోహన్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story