- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బైక్ ఢీ ఒకరు మృతి
by Bhanu |
పట్టణంలోని ఆంధ్ర బోర్ హర్ష హోటల్ ముందు బైక్ ను కార్ డీకొనగా బైక్ నడుపుతున్న చెవుల రాజలింగయ్య (62) అనే వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని ఆంధ్ర బోర్ ప్రాంతంలో హర్ష హోటల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యారు. గొల్లపెళ్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన చెవుల రాజలింగయ్య (62) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఉత్కూర్ చౌరస్తా నుంచి బైక్‌పై ఆంధ్ర బోర్‌లోని తన కుమారుడి టైర్ దుకాణం వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని కారు బైక్‌ను ఢీకొట్టి పరారయ్యింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజలింగయ్యను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి కుమారుడు ఆంధ్ర బోర్‌లో, కుమార్తె గాంధీ నగర్లో నివసిస్తున్నారు. రాజలింగయ్య చిన్న కుమారుడు చెవుల మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
Next Story






