అంగ‌న్ వాడీల కేంద్రాల నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త లోపం

by Ratna Kumari |

దిశ‌, ఆసిఫాబాద్ : అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా అంగ‌న్ వాడీ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా నిర్వహించారు. దీంతో పదేళ్ల పాటు నిలవాల్సిన

అంగ‌న్ వాడీల కేంద్రాల నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త లోపం
X

దిశ‌, ఆసిఫాబాద్ : అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా అంగ‌న్ వాడీ కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా నిర్వహించారు. దీంతో పదేళ్ల పాటు నిలవాల్సిన భవనాలు మధ్యలో శిధిలావస్థలోకి చేరి కుంగిపోతున్నాయి. తిర్యాణీ మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీతి అయోగ్ కార్యక్రమంలో ద్వారా మండలానికి 14 అంగన్ వాడీ కేంద్రాలు మంజూరు చేసింది. ఒక్కొక్క అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.7ల‌క్ష‌ల చొప్పున 97 లక్షల నిధులను కేటాయించింది. ఇందులో ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్ శాఖ వారు ఏడు చొప్పున నిర్మాణ పనులు చేపట్టారు. అయితే రాంబాయి గూడ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అంగన్ వాడీ నిర్మాణ పనులు చేపట్టిన సదరు కాంట్రాక్టు పనులు నాసిరకంగా చేపట్టడంతో ప్రారంభానికి ముందు బిల్డింగ్ లోపలి భాగంలో రాడ్లు బయటకు తేలగా స్లాబ్ పై భాగంలో పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ పిల్లలకు భద్రత పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మిగతా చోట కూడా నిర్మాణ పనులు ఇంచుమించు ఇలానే నాణ్యత లోపంతో కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు : ఏఈ శ్రీనివాస్

అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణ పనులను పరిశీలించిన పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు ఉంటామని పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్ చెప్పారు. నిర్మాణ పనులు నాసిరకంగా ఉంటే కాంట్రాక్టు పై తాగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story