ఆ పాఠశాలలో సమయపాలన లేని టీచర్లు..

by Bhanu |

కుబీర్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పలు ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితిని 'దిశ' పరిశీలించింది.

ఆ పాఠశాలలో సమయపాలన లేని టీచర్లు..
X

దిశ, కుబీర్: కుబీర్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పలు ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితిని 'దిశ' పరిశీలించింది. ఒకే ప్రదేశంలో ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ), గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు కలిసే ఉన్నాయి. అయితే, సమయపాలన విషయంలో అక్కడి టీచర్లు నిర్లక్ష్యం చేస్తున్నట్లు తేలింది.

ప్రాథమిక పాఠశాలలో ప్రార్థన సమయం దాటిపోయినా పాఠశాల ప్రారంభానికి టీచర్లు గైర్హాజరే. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయుల సమక్షంలోనే ప్రార్థన జరిగింది. కేజీబీవీ పాఠశాలలో నలుగురు టీచర్లు మాత్రమే ప్రార్థనలో పాల్గొన్నారు.

ఇక హాస్టల్ భోజనాల్లోనూ నిర్లక్ష్యం కనిపించింది. ఈరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు ఉదయం ఇడ్లీ - సాంబారు ఇవ్వాల్సి ఉండగా, కిచిడి మాత్రమే ఇచ్చారు. కొందరు విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకున్న పచ్చడి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చి ప్రైవేట్ వాహనాల్లో పాఠశాలకు చేరారు.

ప్రభుత్వం తరఫున సమయపాలన కోసం పలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొన్ని పాఠశాలల్లో ఆచరణలో అవి కేవలం కాగితాలపైనే పరిమితమవుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో, పాఠశాల కమిటీలతో పాటు సంబంధిత అధికారులు తక్షణమే నిఘా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, "ఉదయం 9.05కి ప్రార్థన ప్రారంభించాలి. సంబంధిత హెడ్‌మాస్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం," అని తెలిపారు.

Next Story