- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది.

దిశ, ప్రతినిధి నిర్మల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. మాజీ విప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించిన ఈ మేరకు కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో మంచిర్యాల జిల్లాలో నెలకొన్న రాజకీయ కారణాల నేపథ్యంలో మంత్రి వివేక్‌తో ఏర్పడిన తీవ్రస్థాయి విభేదాలు నేపథ్యంలో ఆయన పర్యటన ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు నస్పూర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం అధికార కాంగ్రెస్ ను బలంగా ఎదుర్కొని గెలిచిన క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను కేటీఆర్ సన్మానించనున్నారు. ఆ ఎన్నికల సందర్భంగా బాల్క సుమన్ అరెస్ట్, తదనంతర పరిణామాలు, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం తో పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. ఇదే క్రమంలో మంత్రి వివేక్ ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.
కవిత దూకుడుకు చెక్..?
మరోవైపు తెలంగాణ జాగృతి అధినేత, తన సోదరి కల్వకుంట్ల కవిత దూకుడుకు కేటీఆర్ చెక్ పెట్టే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సింగరేణిలో కార్మిక సంఘంలో ఉన్న భారత్ మజ్దూర్ సంఘ్‌తో కలిసి కవిత సింగరేణిలో బలోపేతం అయ్యే వ్యూహాన్ని రచిస్తున్నది. ముందుగానే కవిత ప్లాన్‌ను కూడా వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసేందుకు ఆయన సింగరేణి ముఖ్య నేతలతో ఈ సందర్భంగా సమావేశం అవుతారని తెలుస్తున్నది.






