కొమురం భీమ్ ఆశయాలను గెలిపించాలి

by Ratna Kumari |

దిశ, తలమడుగు: కొమురం భీమ్ ఆశ‌యాల‌ను గెలిపించాల‌ని తుండుం దెబ్బ మండ‌ల అధ్య‌క్షులు జంగాల పోచ్చ‌న్న పేర్కొన్నారు. తలమడుగు

కొమురం భీమ్ ఆశయాలను గెలిపించాలి
X

దిశ, తలమడుగు: కొమురం భీమ్ ఆశ‌యాల‌ను గెలిపించాల‌ని తుండుం దెబ్బ మండ‌ల అధ్య‌క్షులు జంగాల పోచ్చ‌న్న పేర్కొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో కొమురం భీమ్ 85వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల అధ్యక్షులు జంగాల పోచ్చన్న మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ మన గ్రామంలో మనమే రాజులా జీవించాలని కొమురం భీమ్ ఆశపడ్డారని.. ఆయన ఆశయ సాధనకై ఆదివాసీలంతా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ ధర్మ, తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ భుజంగరావు, పెందుర్ మాధవరావు, నరేందర్, చంటి, అనిల్, ప్రభాకర్, భీమ్రావు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story