- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం తాగొద్దని మందలించినందుకు హత్య
by Kema Shiva Kumar |
ఓ వ్యక్తిని తరచూ తాగొద్దని మందలించినందుకు హత్యకు చేసిన ఘటన జన్నారం మండలం మల్యాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ, జన్నారం: ఓ వ్యక్తిని తరచూ తాగొద్దని మందలించినందుకు హత్యకు చేసిన ఘటన జన్నారం మండలం మల్యాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిని పడితే పోషం (70) తన సమీప బంధువైన దొసండ్ల సుమన్ ను రోజూ మద్యం సేవించడం మంచిది కాదంటూ, ఆరోగ్యం చెడిపోతుందంటూ మందలించాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోషం పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో సుమన్ పథకం ప్రకారం కాపు కాసి తన వద్ద ఉన్న కర్రతో పోషంపై దాడి చేశాడు. ఈ ఘటనలో పోషం కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Next Story






