Khanapur : జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మీదేవిరా..

by Thanuru Gopichand |

నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాసులు జెట్టక్కను (Jettakka) తరిమికొట్టారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Khanapur : జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మీదేవిరా..
X

దిశ, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాసులు జెట్టక్కను (Jettakka) తరిమికొట్టారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లు, చాటలు, పాతబట్టలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మీదేవిరా (Lakshmi Devi) అంటూ గ్రామ శివారు వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ తుమ్మ చెట్లకు బట్టలు, చీపుర్లు, చాటలు కట్టి స్నానాలు చేశారు. అనంతరం ఇండ్లకు చేరుకున్నారు. గ్రామ దేవతలకు (Grama Devathalu) పూజలు చేసిన అనంతరం పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అయితే ఈ ఆచారం వందల సంవత్సరాలుగా తెలంగాణ జిల్లాలో ఆచరిస్తున్నారు. ఊరికి, ఇంటికి పట్టిన చెడు తొలగిపోవాలని ప్రజలు కోరుకుంటారు. పండగలో భాగంగా ఊరు శివారులకు వెళ్లి ఒకరి బట్టలు మరొకరు చింపుకుంటారు. ఇండ్లలో బూజు దులిపి జెట్టక్క పోయింది.. లక్ష్మిదేవి వచ్చిందని సంబరపడతారు. ఆచారం వింతగా ఉన్నప్పటికీ ఇల్లు, ఊరు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయనే నిగూఢ అర్థం పండుగలో దాగుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు వినియోగించే చీపుర్లు, గుడ్డ పీలికలు, చాటలు వంటివి ఈ పండుగలో ప్రధానంగా కనిపిస్తుంటాయి.

Next Story