బాసర ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు

by Ratna Kumari |

దిశ, బాసర : ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడం, అధికారులు పట్టించుకోకపోవడంతో

బాసర ప్రభుత్వ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు
X

దిశ, బాసర : ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడం, అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు బాసర ప్రభుత్వ పాఠశాల వద్దకు చేరుకొని కీచక ఉపాధ్యాయుడు మూర్తాజ్ అలీ ను నిలదీసి ఆందోళన చేశారు. ఈఘటన జరిగి దాదాపు వారం గడుస్తున్న సంఘటనకు సంబంధించిన విషయాలను అధికారులు బయటకు పోక్కణీయకుండ జాగ్రత్త పడ్డారు. తీర తెలిసే సరికి దీపావళి సెలవులు ఉండటంతో విచారణ ఆలస్యం అయిందని మీడియా కు వివరణ ఇచ్చారు. ఐతే విద్యార్థినీల తల్లిదండ్రులు పాఠశాల వద్ద హంగామా చేయడంతో శుక్రవారం రెండు టీమ్ లను సంబంధిత పాఠశాలకు పంపి విచారణ జరుపుతున్నామని మండల విద్యాశాఖ అధికారి మైసాజీ తెలిపారు. ఏంఈఓ మైసాజీ తను స్వయంగా ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇంకా మిగతా పాఠశాలలో పరిస్తితి ఏంటో అని విద్యార్థుల తల్లిదండ్రులు నిట్టూరుస్తున్నారు. సంబంధిత కీచక ఉపాధ్యాయుడి పై విద్యాశాఖ అధికారులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారు చూడాలి ఇదిలా ఉంటే తనపై కక్ష సాధింపు చర్యగా కుట్టబడుతున్నారని ఉపాధ్యాయుడు తెలుపుతున్నారు

Next Story