చదువుతోనే మంచి భవిష్యత్తు కన్నెపల్లి : ఎస్ఐ భాస్కర్ రావు

by Ratna Kumari |

దిశ, కన్నెపల్లి : విద్యార్థులకు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని కన్నెపల్లి ఎస్ఐ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం ZPHS, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

చదువుతోనే మంచి భవిష్యత్తు కన్నెపల్లి : ఎస్ఐ భాస్కర్ రావు
X

దిశ, కన్నెపల్లి : విద్యార్థులకు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని కన్నెపల్లి ఎస్ఐ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం ZPHS, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన విధులు విద్యార్థులకు తెలియజేస్తూ పోలీస్ స్టేషన్లో ఉండే కమ్యూనికేషన్ సెట్, లాకప్ రూమ్స్ వారు ఉపయోగించిన ఇతర పరికరాల గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ జీవితంలో స్థిరపడాలంటే విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకోవాలని, చదువులో ప్రతిభ ఫలితంగానీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు అని తెలిపారు. జీవితంలో స్థిరంగా ఉండాలంటే చదువే ముఖ్యమని అన్నారు.

Next Story