- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నప్రేమకు కరువై.. పత్తి చేనులో పసికందు
అభం శుభం తెలియని పసిపాపను ఓ తల్లి పత్తి చేనులో పారిసింది. ఆకలితో అలమటించిన ఆ పాప కేకలు విన్న ఓ మహిళా చూసి ఆ పాపను రక్షించింది. ఈ అవమానీయ ఘటన కాగజ్ నగర్ మండల పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, కాగజ్‌నగర్ : నవమాసాలు మోసి, ప్రాణం పోసిన కన్న తల్లే కాలయమురాలైందో లేక సామాజిక భయమో తెలియదు. కానీ పసిపాప పొలం బాటలో కనిపించింది. కళ్లు కూడా విప్పని ఆ పసికందును గుడ్డలో చుట్టి, పత్తి చేనులో విసిరేసిన అమానవీయ ఘటన కాగజ్‌నగర్ మండలంలో వల్లగొండ గ్రామపంచాయతీ పరిధిలోని సీతానగర్ శివారులో వెలుగుచూసింది. పత్తి చేనులో వెళ్లిన మహిళకు శిశువు ఏడుపు వినపడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి గ్రామస్థులను అందరిని పిలిచింది. ఇవాళ ఉదయం పత్తి మొక్కల మధ్య గుడ్డలో చుట్టి ఉన్న పసికందు కనిపించింది. చలిని, పురుగు పుట్రను లెక్కచేయకుండా ఆ బిడ్డను అక్కడ వదిలేసిన తీరును చూసి గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో స్పందించిన పోలీసులు ఆ పాపను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదృష్టవశాత్తూ ఆ పసి ప్రాణం ముప్పు నుంచి తప్పించుకుంది. అనంతరం ఆ శిశువును బాలల సంరక్షణ శాఖ అధికారులకు అప్పగించారు.
కన్నబిడ్డను ఇలా అనాథగా వదిలేయడం క్షమించరాని నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అజ్ఞాత వ్యక్తుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. లోకం తెలియని ఆ పసికందు చేసిన తప్పేంటి ఆడబిడ్డ అని భారంగా భావించారా లేక అక్రమ సంబంధం దాచుకోవడానికి చేసిన ప్రయత్నమా కారణం ఏదైనా కానీ ఒక ప్రాణాన్ని పత్తి చేనులో గాలికి వదిలేసిన ఆ కసాయి వ్యక్తులకు కఠిన శిక్ష పడాల్సిందేనని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






