పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి

by Nallavelli.Anjaneyulu |

పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు.

పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి
X

దిశ, లక్షెట్టిపేట : పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీఆర్ గార్డెన్ లో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు చెందిన 376 లబ్ధిదారులకు (37643616) మూడు కోట్ల 76 లక్షల 43 వేల 616 విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంది అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దిలీప్ కుమార్, గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగిలి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరిఫ్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు పెండం పద్మ రాజు, తోట సువర్ణ రమేష్, సూరం చంద్రమౌళి, బోడ రాజు,సర్పంచులు నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story