- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల సమస్యల పై స్పందించిన జేసీ.. వ్యవసాయ అధికారుల పై ఆగ్రహం
అహర్నిశలు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, మామడ : అహర్నిశలు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఆదర్శనగర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారం రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడంతో రోడ్డుపైనే ఎండుతున్నాయని, దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కమల్ కోట్, న్యూ టెంబరిని, ఆదర్శనగర్ గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం రహదారి పై ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా కొనుగోలు చేయాలని రైతులు ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు గంటల పాటు రైతులు ఎండను సైతం లెక్కచేయకుండా రహదారి పై కూర్చున్నారు. ఈ సంఘటన స్థలాన్ని జేసీ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ గోవర్ధన్ రెడ్డిలు సందర్శించి, వడ్లను చెన్నిపడతామనడంతో రైతులు ఆగ్రహించారు. జేసీ వచ్చినప్పుడు కరెంటు లేదని ఎలా చెన్నిపడుతామని రైతులు పేర్కొన్నారు. 42 కిలోల వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని జేసీ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తేడా వస్తే చర్య తీసుకుంటామని వ్యవసాయ అధికారుల పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.






