పరుగులో డీ హైడ్రేషన్‌.. చికిత్స పొందుతూ జవాన్ ఆకాష్ మృతి..

by Bhanu |

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని వర్త మన్నూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నలువల ఆకాష్ మృతి చెందాడు.

పరుగులో డీ హైడ్రేషన్‌.. చికిత్స పొందుతూ జవాన్ ఆకాష్ మృతి..
X

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని వర్త మన్నూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నలువల ఆకాష్ మృతి చెందాడు. అస్సాం రైఫిల్స్ రెజిమెంట్‌లో శిక్షణ పొందుతున్న ఆకాష్, శారీరక సాధనలో భాగంగా నిర్వహించిన 20 కిలోమీటర్ల పరుగులో డీ హైడ్రేషన్‌కు గురయ్యాడు. వెంటనే అతన్ని మిలటరీ ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడని ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కేవలం ఆరు నెలల క్రితమే ఆకాష్ అస్సాం రైఫిల్స్‌లో జవాన్‌గా ఎంపికై శిక్షణ తీసుకుంటుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ జవాన్ ఆకస్మిక మరణం విన్న గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆకాష్ మరణ వార్తతో వర్త మన్నూర్ గ్రామం మౌనచ్ఛాయలతో నిండి ఉంది.

Next Story