జాటోత్ టాను నాయక్ పోరాటం ఆదర్శనీయం

by Nallavelli.Anjaneyulu |

గడిల పాలనకు వ్యతిరేకంగా విసునూర్ దేశముఖ్ దొరల పాలనకు, నిజాం నవాబు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ టాను నాయక్ చేసిన పోరాటం ఆదర్శనీయమని లంబాడా నాయకులు అన్నారు.

జాటోత్ టాను నాయక్ పోరాటం ఆదర్శనీయం
X

దిశ, ఉట్నూర్ : గడిల పాలనకు వ్యతిరేకంగా విసునూర్ దేశముఖ్ దొరల పాలనకు, నిజాం నవాబు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ టాను నాయక్ చేసిన పోరాటం ఆదర్శనీయమని లంబాడా నాయకులు అన్నారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని పాత ఉట్నూరు ఎన్.ఆర్. న‌గ‌ర్ లో జాటోత్ టాను నాయక్ 76వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. లంబాడా జాతి ఆణిముత్యాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి స్ఫూర్తితో రాజ్యాంగబద్ధ హక్కులను సాధించుకొని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలని, అలాగే భూమిలేని గిరిజనులందరికీ మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి, పంపిణీ చేయాలన్నారు. జాటోత్ టాను నాయక్ పోరాట స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి ఆయన విగ్రహాన్ని పాత ఉట్నూరులో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తామని, దానికి జాతి ప్రజలందరూ తోడ్పాటునందించాలన్నారు. టాను నాయ‌క్ ని లంబాడా సమాజం ఆదర్శంగా తీసుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నేతావత్ రాందాస్ నాయక్, బానోత్ రామారావు, లంబాడి జేఏసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ జగన్ నాయక్, అడ్వకేట్, సలహదారులు జాదవ్ రామ్ కిషన్ నాయక్, లంబాడా నాయకులు పవార్ దేవిదాస్, పవర్ విజయ్ కుమార్, జాదవ్ రమణా నాయక్ ,ఆడే బాలాజీ పాల్గొన్నారు.

Next Story