సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ : మాజీ మంత్రి

by Batti.Sumithra |

సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు.

సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ : మాజీ మంత్రి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టరేట్ రోడ్డులో ఆయన విగ్రహానికి ఆదివారం మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడని అన్నారు.

దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడి, ఉపప్రధానిగా, కేంద్ర మంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధికి విశేషంగా సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది గాజుల రవికుమార్, కౌన్సిలర్ కత్తి నరేందర్, మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగన్న, లక్ష్మణ్, కోశాధికారి ముత్యం, తదితరులు పాల్గొన్నారు.

Next Story