ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పై దుష్ప్రచారం చేయడం సరికాదు

by Nallavelli.Anjaneyulu |

ఉట్నూర్ లోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలు మూత పడే అవకాశాలు ఉన్నాయనే భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పై దుష్ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పై దుష్ప్రచారం చేయడం సరికాదు
X

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ లోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలు మూత పడే అవకాశాలు ఉన్నాయనే భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పై దుష్ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు దాడండ్ల ప్రభాకర్, దూట రాజేశ్వర్, మార్సుకోల తిరుపతి, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంత్ రావు, చంద్రయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోనీ విద్యార్ధులు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్ ఎంతో కృషితో ఉట్నూర్ లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఇటీవల ఖానాపూర్ లో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఏర్పాటులో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ స్కూల్ ఏర్పాటు వల్ల ఉట్నూర్ లో బీజేపీ నేతకు చెందిన ప్రైవేట్ విద్యా సంస్థలు మూత పడతాయని భయంతో గిరిజన ప్రాంత విద్యార్థుల ను దోచుకోవడమే లక్ష్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమే ఆ పార్టీల నాయకులు లక్ష్యంగా కుట్ర చేస్తున్నారనీ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారం తిప్పి కొట్టి విధంగా తంగిన బుద్ధి చెప్పాలని, త్వరలోనే ఒక జెఏసీ నీ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆన్సర్, బిరుదులు లాజర్, నిస్సార్, అరికిళ్ల అశోక్, జాదవ్ రాజేష్ పాల్గొన్నారు.

Next Story