మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయం : మంత్రి అల్లోల

by Disha Web Desk 11 |
మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయం : మంత్రి అల్లోల
X

దిశ మామడ : రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని వాస్తవపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గుస్సాడి నృత్యాలు, మంగళహారతులు ,బతుకమ్మ ఆటలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు . గిరిజనులు కల్మషం లేని మనుషులని వారికి కోపతాపాలు ఉండవని ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ ఊరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటికి పెద్ద కొడుకుగా మీ అందరికీ తోడుగా ఉంటారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఇంటింటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు .ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,బీఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రెడ్డి, హరీష్ కుమార్, లింగారెడ్డి, గంగారెడ్డి ,చంద్రశేఖర్ గౌడ్ భాస్కర్ రావు, రాందాస్ ,అరవింద్, ముత్యంరెడ్డి,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed