- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు కోసం పోరాడితే అక్రమ కేసులా..? : మాజీ మంత్రి జోగు రామన్న
దిశ, ఆదిలాబాద్ : పత్తి రైతులకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తనపై,పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీమంత్రి,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న

దిశ, ఆదిలాబాద్ : పత్తి రైతులకు న్యాయం జరగాలన్న డిమాండ్ తో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తనపై,పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీమంత్రి,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు..బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీ ఇంటి వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు ప్రయత్నించామని,అయినప్పటికీ పోలీసులు తమను అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారన్నారు.సీసీఐ విధించిన తేమ నిబంధనలు,ఏడు క్వింటాళ్ల పరిమితి విధించడంతో పత్తి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు.రైతాంగానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎంపీ,ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడం లేదని,ఈ విషయంపై అనేక మార్లు అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఎంపీ ఇంటి వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు నిర్ణయించామని అన్నారు.ఇదే సమయంలో పోలీసులు తమను బలవంతంగా తీసుకేల్లారని, తోపులాటలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు భరోసా కల్పించాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం సరికాదన్నారు.ఇప్పటికైనా సీసీఐ నిబంధనలు సడలిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నాయకులు విజ్జగిరి నారాయణ,అలాల్ అజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.






