ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

by Ratna Kumari |

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో ఇసుక మాఫియా అక్రమ కార్యకలాపాలు సాగిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుందనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. కౌటాల, చింతలమానేపల్లి

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
X

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో ఇసుక మాఫియా అక్రమ కార్యకలాపాలు సాగిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుందనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించారు. అక్రమ డంపింగ్‌పై చర్యలు ముఖ్యంగా ధరంపల్లి వాగు నుంచి ఇసుక మాఫియా సభ్యులు ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ ఇసుకను బోధంపల్లి–ధరంపల్లి గ్రామాల పరిసరాల్లో భారీ స్థాయిలో డంపింగ్ చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాచారం మేరకు, మైనింగ్, రెవెన్యూ, మరియు పోలీసు శాఖలకు చెందిన ప్రత్యేక బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ బృందాలు ధరంపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా డంపింగ్ చేసిన ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ, అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాలో పాలుపంచుకున్న వారిపై, దీని వెనుక ఉన్న మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఈ బృందాలు తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నాయని తెలిపారు.

Next Story